ఉచిత రేషన్‌పై ఢిల్లీ సర్కార్ చల్లటి కబురు

ABN , First Publish Date - 2022-06-30T02:41:14+05:30 IST

ఢిల్లీవాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. సెప్టెంబర్ 30వ..

ఉచిత రేషన్‌పై ఢిల్లీ సర్కార్ చల్లటి కబురు

న్యూఢిల్లీ: ఢిల్లీవాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఆ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఇందువల్ల ఢిల్లీలోని 73 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నుంచి సుమారు 73 లక్షల మంది పౌరులకు ఉచిత రేషన్ ఇచ్చామని తెలిపారు. ''గత రెండేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తోంది. సెప్టెంబర్ 30 వరకూ దీనిని పొడిగిస్తున్నాం'' అని కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటిస్తూ కేజ్రీవాల్ తెలిపారు.

Updated Date - 2022-06-30T02:41:14+05:30 IST