తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం

ABN , First Publish Date - 2022-10-07T10:23:50+05:30 IST

తెలంగాణ సెంటిమెంట్‌తో తెలుగు తల్లికి ద్రోహం చేసిన కేసీఆర్‌, ఇప్పుడు పార్టీ పేరు మార్చేసి తెలంగాణ తల్లికీ తీరని ద్రోహం చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది.

తెలంగాణ తల్లికి కేసీఆర్‌ ద్రోహం

ప్రాంతానికో తల్లిని సృష్టించే విషనాగు: ఏపీ బీజేపీ

బెంగళూరు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సెంటిమెంట్‌తో తెలుగు తల్లికి ద్రోహం చేసిన కేసీఆర్‌, ఇప్పుడు పార్టీ పేరు మార్చేసి తెలంగాణ తల్లికీ తీరని ద్రోహం చేశారని బీజేపీ వ్యాఖ్యానించింది. ఏపీ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు బెంగళూరులో గురువారం మీడియాతో మాట్లాడారు. సుభిక్షంగా ఉన్న తెలుగుతల్లిని రెండుగా విభజించి, తెలంగాణ తల్లే తమ సర్వస్వమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, భారతీయ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పుడు తనకు ఏ తల్లి ఆదర్శప్రాయమో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రాంతానికో తల్లిని సృష్టించే విషనాగు కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. 

Updated Date - 2022-10-07T10:23:50+05:30 IST