కాట్పాడి Railway వంతెన ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-05T13:59:57+05:30 IST

స్థానిక కాట్పాడి రైల్వే వంతెనను సోమవారం కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ ప్రారంభించారు. శిధిలావస్థకు చేరిర ఈ వంతెన మరమ్మతులను రైల్వే, జాతీయ

కాట్పాడి Railway వంతెన ప్రారంభం

వేలూరు(చెన్నై) జూలై 4: స్థానిక కాట్పాడి రైల్వే వంతెనను సోమవారం కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ ప్రారంభించారు. శిధిలావస్థకు చేరిర ఈ వంతెన మరమ్మతులను రైల్వే, జాతీయ రహదారుల శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. మరమ్మతుపనులు ముగియడంతో వంతెనపై చిన్న, భారీ వాహనాలు నడిపి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ జెండా ఊపి వంతెనపై వాహనాల రాకపోకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాట్పాడి 1వ మండల కమిటీ అధ్యక్షుడు పుష్పలత వన్నియరాజ, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read more