1127 Covid పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2022-07-07T16:23:17+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు 1127 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు 1127 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1053, దక్షిణకన్నడ, మైసూరులో 13 చొప్పున, ధారవాడలో 11 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదిలోపు కాగా 12 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 1127 మంది కోలుకున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో 6,481 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 6,056 మంది ఉన్నారు.