రాష్ట్రంలో త్వరలో Booster Dose
ABN , First Publish Date - 2022-07-15T16:14:26+05:30 IST
‘ ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కొవిడ్ బూస్ట్‌ర్ డోస్‌ను కానుకగా

బెంగళూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘ ఆజాదీ కా అమృత్’ మహోత్సవాలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కొవిడ్ బూస్ట్‌ర్ డోస్‌ను కానుకగా ప్రకటించడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కె. సుధాకర్ హర్షం వ్యక్తంచేశారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వాక్సిన్ల డోస్‌లు అందిన తక్షణం 18 నుండి 59 సంవత్సరాల లోపు వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కొవిడ్ నాల్గోవేవ్ వస్తుందో లేదో తెలియదని అయినా ముందు జాగ్రత్తగా అర్హులంతా బూస్టర్‌డోస్ వేయించుకోవాలని మంత్రి సూచించారు. తొలి డోస్, రెండో డోస్ వేయించుకోని వారు కూడా సాధ్యమైనంతర త్వరగా వేయించుకోవాలని ఆ యన కోరారు. నిరంతరం అప్రమత్తత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.