కాంట్రాక్టర్‌ ఆత్మహత్య.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా

ABN , First Publish Date - 2022-04-15T01:13:45+05:30 IST

బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యతో సంబంధం ఆరోపణలపై కర్ణాటక పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు.

కాంట్రాక్టర్‌ ఆత్మహత్య.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా

బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్యతో సంబంధం ఆరోపణలపై కర్ణాటక పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు. రాజీనామా చేయాలన్న సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేస్తానని ఈశ్వరప్ప ప్రకటించారు. కాంట్రాక్టర్‌ సంతోష్ ఆత్మహత్యకు ముందు మంత్రి ఈశ్వరప్ప పేరు ప్రస్తావించినందున ఆయనపై కేసులు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. మరోవైపు ఉడుపి నగరంలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ పాటిల్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. Read more