Kamal Haasan: రాజరాజ చోళుడి కాలంలో హిందు మతం లేదు

ABN , First Publish Date - 2022-10-07T13:22:20+05:30 IST

రాజరాజ చోళుడి కాలంలో హిందూ మతం అంటూ ఏదీ లేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan)

Kamal Haasan: రాజరాజ చోళుడి కాలంలో హిందు మతం లేదు

                                                      - కమల్‌ హాసన్‌


అడయార్‌(చెన్నై), అక్టోబరు 6: రాజరాజ చోళుడి కాలంలో హిందూ మతం అంటూ ఏదీ లేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌(Kamal Haasan) పేర్కొన్నారు. ఆయన బుధవారం రాత్రి నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, రాజరాజ చోళన్‌ కాలంలో హిందూ మతమే లేదని, అప్పట్లో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మతాలు మాత్రమే ఉండేవని, హిందూ అనేది ఆంగ్లేయులు పెట్టిన పేరు అని వెల్లడించారు. తమిళనాట మతాలన్నీ వేర్వేరుగా ఉండేవని, వీటిని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరులు సమైక్యపరిచారన్నారు. దర్శకుడు వెట్రిమారన్‌ చెప్పినట్లు రాజరాజచోళన్‌ను హిందువుగా పరిగణించడానికి వీలులేదని, అప్పట్లో హిందూ మతమే లేదని, ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలు అని కమల్‌ వివరించారు. 


Updated Date - 2022-10-07T13:22:20+05:30 IST