నూతన సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌

ABN , First Publish Date - 2022-10-18T09:33:08+05:30 IST

సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నియమితులయ్యారు.

నూతన సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌

రాష్ట్రపతి ఆమోదం.. కేంద్ర న్యాయమంత్రి రిజిజు వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 17: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు సోమవారం ట్వీట్‌ చేశారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ నవంబరు 9న నూతన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండేళ్లపాటు అంటే 2024 నవంబరు పదో తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. 65 ఏళ్లు నిండటంతో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నవంబరు 8న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం కేవలం 74 రోజులే కావడం గమనార్హం. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Read more