13 నుంచి ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు

ABN , First Publish Date - 2022-05-29T15:31:25+05:30 IST

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పాఠశాలలు ప్రారంభించిన అనంతరం ప్రారంభమవుతాయని ప్రకటన వెలువడింది. ఆ

13 నుంచి ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు

పెరంబూర్‌(చెన్నై): వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పాఠశాలలు ప్రారంభించిన అనంతరం ప్రారంభమవుతాయని ప్రకటన వెలువడింది. ఆ ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 11వ తరగతి వరకు విద్యార్థుల అడ్మిషన్లు జూన్‌ 13 నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13న అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి టెన్త్‌ వరకు జూన్‌ 13 నుంచి, 12వ తరగతి విద్యార్థులకు 20న, 11వ తరగతి విద్యార్థులకు 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి 1,6,9,11 తరగతుల్లో విద్యార్థుల అడ్మిషన్లు 12వ తేదీ నుంచి జరుగనున్నాయి. అలాగే, మిగిలిన 2,3,4,7,8,10 తరగతుల అడ్మిషన్లు కూడా ఆరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే అడ్మిషన్‌ ప్రక్రియ చేపట్టిన తరుణంలో ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు మాత్రం ఆలస్యం కానున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-05-29T15:31:25+05:30 IST