అగ్నిపథ్‌పై యువతకు అవగాహన కల్పించాలని BJP శ్రేణులకు నడ్డా ఆదేశాలు
ABN , First Publish Date - 2022-06-20T17:14:47+05:30 IST
అగ్నిపథ్ వ్యవహారంపై దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమైంది.

న్యూఢిల్లీ : అగ్నిపథ్(Agnipath) వ్యవహారంపై దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు బీజేపీ(BJP) సిద్ధమైంది. ఎక్కడైతే వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతకు అవగాహన కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ భవిష్యత్తును రక్షణను భద్రతను అన్నీ దృష్టిలో పెట్టుకొని అగ్నిపథ్ పథకాన్ని తీసుకు వచ్చినట్లుగా యువతకు చెప్పాలని ఆయన సూచించారు. అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయకుండా సైనిక బలగాలు నియామకాల ప్రక్రియను మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని యువతకు చెప్పాలని తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నాయకత్వానికి, కేంద్ర కార్యాలయంలో ముఖ్యులకు సమన్వయ బాధ్యతలను నడ్డా అప్పగించారు.