JCD Prabhakar: రూ.41 కోట్ల బేరసారాల రహస్యం వెల్లడిస్తా..

ABN , First Publish Date - 2022-10-07T14:20:41+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) వర్గీయులు దాచి పెడుతున్న రూ.41వేల కోట్ల

JCD Prabhakar: రూ.41 కోట్ల బేరసారాల రహస్యం వెల్లడిస్తా..

                         - ఈపీఎస్‌ వర్గానికి ఓపీఎస్‌ అనుచరుడి బెదిరింపు


చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) వర్గీయులు దాచి పెడుతున్న రూ.41వేల కోట్ల బేరసారాల వ్యవహారానికి సంబంధించి నవంబర్‌లో గుట్టు బట్టబయలుచేయనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) వర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు జేసీడీ ప్రభాకర్‌(JCD Prabhakar) వెల్లడించారు. చెన్నైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఓపీఎస్‏కు రోజురోజుకూ పెరుగుతున్న బలాన్ని చూసి ఈపీఎస్‌ వర్గం ఖంగుతింటోందన్నారు. పార్టీ కోసం ఓపీఎస్‌ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, చివరకు పార్టీ సర్వసభ్యమండలి సమావేశంలో ఆయనపై పథకం ప్రకారం దాడి జరిగినా ఈపీఎస్‏గానీ, ఆయన వర్గీయులుగానీ అడ్డుకోలేదని ఆరోపించారు. ఓపీఎస్‌ ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు మాజీ మంత్రులు తంగమణి, వేలుమణి రాజీ ప్రయత్నాలు చేశారని, ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అనుమతించాలని, ఆ తర్వాత జరిగే (2021) శాసనసభ ఎన్నికల్లో ఓపీఎస్‏ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా హామీ ఇచ్చారని ప్రభాకర్‌ గుర్తు చేశారు. శాసనసభ ఎన్నికల్లో మాట మార్చి ఈపీఎస్‏ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని, ప్రస్తుతం ఈపీఎస్‌ వర్గంలోని నేతలంతా అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు అధికారపార్టీకి చెందిన ఎవరెవరితో బేరసారాలు చేసారో త్వరలో వెల్లడిస్తానని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా డీఎంకేకు సానుకూలంగా వ్యవహరిస్తున్న ఈపీఎస్‌ వర్గానికి చెందిన నేతలు సాగించిన రూ.41 వేల కోట్ల బేరసారాల రహస్యాన్ని నవంబర్‌ 21కి ముందే వెల్లడించనున్నామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-10-07T14:20:41+05:30 IST