కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్‌పై జవాన్ కాల్పులు
ABN , First Publish Date - 2022-01-04T23:38:08+05:30 IST
తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్‌పై కాల్పులు జరిపారు ఒక జవాన్. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడంతో బుల్లెట్ ఆమెకు తగిలి గాయపడింది. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలో సోమవారం జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన..

జైపూర్: తన కూతురిని కొట్టాడని స్కూల్ డైరెక్టర్‌పై కాల్పులు జరిపారు ఒక జవాన్. అయితే ఆ సమయంలో ఆయన భార్య అడ్డు రావడంతో బుల్లెట్ ఆమెకు తగిలి గాయపడింది. రాజస్తాన్‌లోని భరత్పూర్ జిల్లాలో సోమవారం జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్వాడాకు చెందిన జవాన్ పప్పు గుర్జల్.. తన కూతురు చదువుతున్న అదే ఊర్లోని ఓ ప్రైవేటు స్కూలుకు వెళ్లి స్కూలు డైరెక్టర్‌ను కలిశారు. ఆ సమయంలో ఆయన కూతురు హోం వర్క్ చేయలేదని టీచర్ కొట్టిన విషయాన్ని గుర్జల్కు చెప్పింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గుర్జల్ స్కూల్ డైరెక్టర్‌పై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో గుర్జల్ భార్య అడ్డు రావడంతో ఆమె భుజంలోకి బుల్లెట్ దిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుర్జర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం మాట్లాడుతూ.. గుర్జర్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నాడని, సర్విస్ తుపాకీ కూడా తనతోనే ఉందని తెలిపారు.