సంయుక్త కమిటీ పరిశీలనకు జన్ విశ్వాస్ బిల్లు
ABN , First Publish Date - 2022-12-31T05:07:38+05:30 IST
సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు గానూ వివిధ చట్టాల్లో నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్లును అధ్యయనం చేయడానికి 31 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు బులెటిన్ జారీ చేశాయి.
కమిటీలో పలువురు తెలుగు ఎంపీలు
న్యూఢిల్లీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు గానూ వివిధ చట్టాల్లో నిబంధనలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ విశ్వాస్ బిల్లును అధ్యయనం చేయడానికి 31 మంది ఎంపీలతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తూ లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు బులెటిన్ జారీ చేశాయి. ఈ కమిటీలో వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, వెంకట సత్యవతితోపాటు తెలంగాణకు చెందిన ఎంపీ ధర్మపురి అర్వింద్, ఏపీకి చెందిన మరో బీజేపీ ఎంపీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ఎంపీ పీపీ చౌధురి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.