Indian Railways : సాంకేతిక కారణాలతో పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-11-14T09:58:58+05:30 IST

రైల్వే ట్రాక్ మరమ్మతులు, వివిధ నిర్వహణ పనులు, సాంకేతిక లోపాలతో దేశంలో పలు రైళ్లు ...

Indian Railways : సాంకేతిక కారణాలతో పలు రైళ్ల రద్దు
Indian Railways

న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్ మరమ్మతులు, వివిధ నిర్వహణ పనులు, సాంకేతిక లోపాలతో దేశంలో పలు రైళ్లు ప్రతీరోజూ రద్దు అవుతూనే ఉన్నాయి. కారణాలు ఏవైనా తరచూ రైళ్ల(Trains) రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత 15రోజులుగా దేశంలో పలు ప్రధాన రైలు మార్గాల్లో పలు రైళ్లను భారతీయ రైల్వే(Indian Railways) అధికారులు రద్దు చేశారు. మళ్లీ సోమవారం కూడా దేశంలో 147 రైళ్లను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. మరో 46 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.(Cancels) భారీవర్షాలు, వరదల వల్ల కూడా దేశంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 160 రైళ్లను రద్దు చేశారు. మళ్లీ సోమవారం 147 రైళ్లు రద్దు చేశారు. పలు కారణాల వల్ల మంగళవారం కూడా పలు రైళ్లను రద్దు చేయనున్నారు. రైలు మార్గం నిర్వహణ పనులతో పలు రైళ్లను దారి మళ్లించారు.

పఠాన్ కోట్, గ్వాలియర్, లూథియానా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, హోషియార్ పూర్, జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, మధురై, రాయపూర్,బిలాస్ పూర్,రత్నగిరి, ప్రతాప్ నగర్, వరణాసి, అహ్మదాబాద్ ప్రాంతాల్లో పలు రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో ఇచ్చామని అధికారులు చెప్పారు. దేశంలో పలు రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.రైళ్ల రద్దు వల్ల రైల్వేశాఖకు తీరని నష్టం జరుగుతోంది.

Updated Date - 2022-11-14T09:58:59+05:30 IST