సౌదీపై దాడికి ఇరాన్‌ కుట్ర

ABN , First Publish Date - 2022-11-03T04:17:03+05:30 IST

హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు సౌదీ అరేబియాపై ఇరాన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌

సౌదీపై దాడికి ఇరాన్‌ కుట్ర

హిజాబ్‌ ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే..

దుబాయి, నవంబరు 2: హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనల నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు సౌదీ అరేబియాపై ఇరాన్‌ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ సంస్థలు హెచ్చరించాయి. ఇరాక్‌లోని ఎర్బిల్‌ ప్రాంతంలోనూ దాడి చేసే అవకాశం ఉందని ఆ సంస్థలు నివేదించాయి. దీనిపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు వైట్‌హౌ్‌సలోని జాతీయ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. సౌదీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. హెచ్చరికల నేపథ్యంలో సౌదీ, అమెరికాతోపాటు దక్షిణాసియా దేశాల సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. సెప్టెంబరు నుంచి ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీని వెనుక అమెరికా, సౌదీ, ఇజ్రాయెల్‌ ఉన్నాయని ఇరాన్‌ ఆరోపించింది.

Updated Date - 2022-11-03T04:17:03+05:30 IST
Read more