పాక్‌లో పడ్డ భారత క్షిపణి.. విచారణకు భారత్ ఆదేశం
ABN , First Publish Date - 2022-03-12T01:59:33+05:30 IST
భారత్‌కు చెందిన మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై మోదీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం సాయంత్రం సిస్రా వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల..

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై మోదీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం సాయంత్రం సిస్రా వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ విషయమై శుక్రవారం రక్షణ శఆఖ మంత్రి మాట్లాడుతూ సాంకేతిక లోపం కారణంగా పొరపాటుగా జరిగిన ఘటన ఇదని అన్నారు. ఈ క్షిపణి 40,000 అడుగుల ఎత్తులో దూసుకెళ్లిందని, పాక్ భూభాగంలోని పౌర నివాసాలు, పాక్‌తోపాటు భారత్ గగనతలంలోని ప్రయాణ విమానాలకు ముప్పును రేకెత్తించిందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది.