Guinness Book of World Record: మూడు కిలోమీటర్ల దూరం మువ్వన్నెల జెండా...వరల్డ్ రికార్డ్
ABN , First Publish Date - 2022-08-13T18:16:00+05:30 IST
75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం(75 Independence Day) ఆజాదీకా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrit Mahotsav) సందర్భంగా...

బొకారో సిటీ(జార్ఖండ్): 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం(75 Independence Day) ఆజాదీకా అమృత్ మహోత్సవ్(Azadi Ka Amrit Mahotsav) సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో సిటీలో(Bokaro) 3కిలోమీటర్ల దూరం అతిపెద్ద జాతీయ జెండాను(three km long TRICOLOUR) రూపొందించి గిన్నిస్ బుక్ రికార్డు(Guinness Book of World Record) సృష్టించారు. సోషల్ వర్కర్ సంజీవ్ కుమార్ అతిపెద్ద మువ్వెన్నెల జెండాకు రూపకల్పన చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అతి పెద్ద జాతీయ జెండా తయారు చేసేందుకు 3500 మీటర్ల వస్త్రాన్ని వినియోగించారు. నలుగురు టైలర్లు, ఇద్దరు పెయింటర్లు రాత్రీ పగలూ పనిచేసి ఆగస్టు 13వతేదీన పెద్ద జెండాను సిద్ధం చేశారు.
ఈ పెద్ద జెండా రూపకల్పనలో బాలికలు, మహిళలు సైతం పాల్గొన్నారు. ఆదివారం ఈ పెద్ద త్రివర్ణ పతాకాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఎగురవేయనున్నారు.(national flag yatra)గతంలో ఈజిప్టు దేశంలో 2,500 మీటర్ల పొడవు గల జెండాను తయారు చేశారని, ప్రస్థుతం తాము 3,500 మీటర్ల జెండాను రూపొందించి గత గిన్నిస్ రికార్డును బ్రేక్ చేశామని సంజీవ్ సింగ్ చెప్పారు.