బీమా పథకాల ప్రీమియం పెంపు

ABN , First Publish Date - 2022-06-01T08:14:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీమా పథకాల ప్రీమియం రేట్లు పెరిగాయి.

బీమా పథకాల ప్రీమియం పెంపు

బీమా పథకాల ప్రీమియం పెంపు

పీఎం జీవన్‌ జ్యోతి ఇక నుంచి రూ.436

రూ.12 నుంచి 20కి పెరిగిన సురక్షా బీమా

నేటి నుంచే అమల్లోకి: కేంద్రం ప్రకటన

కంపెనీల నష్టాలను తగ్గించడం లక్ష్యం


న్యూఢిల్లీ, మే 31: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీమా పథకాల ప్రీమియం రేట్లు పెరిగాయి. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకం ప్రీమియంను ఏడాదికి రూ.436 చేశారు. ఇప్పటివరకు ఈ ప్రీమియం రూ.330గా ఉంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎ్‌సబీవై) పథకం ప్రీమియం రూ.12 నుంచి రూ.20కి పెరిగింది. పెరిగిన ప్రీమియం రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. వసూలవుతున్న ప్రీమియం కంటే క్లయిమ్‌లకు చెల్లిస్తున్న మొత్తం ఎక్కువగా ఉంటోందని, దీనివల్ల బీమా కంపెనీల నష్టాలను తగ్గించేందుకే ప్రీమియం ధరలు పెంచినట్టు కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి పీఎంఎ్‌సబీవై పథకం ద్వారా రూ.1,134 కోట్ల ప్రీమియం వసూలైంది. క్లెయిమ్‌ల చెల్లింపులు మాత్రం రూ.2,513 కోట్ల మేరకు ఉన్నాయి. అలాగే పీఎంజేజేబీవై పథకానికి వసూలైన ప్రీమియం రూ.9,737 కోట్లు. క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ కోసం రూ.14,144 కోట్లు చెల్లించారు. ప్రీమియం రేట్లను పెంచడం ద్వారా ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఆయా పథకాలను అమలు చేస్తాయని కేంద్రం పేర్కొంది. ఏదైనా బ్యాంక్‌ లేదా పోస్టాఫీ్‌సలో అకౌంట్‌ ఉన్నవారికి ఈ రెండు బీమా పథకాలు వర్తిస్తాయి. అకౌంట్‌ నుంచి ఆటోమేటిగ్గా ప్రీమియం చెల్లించడానికి ఖాతాదారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

Updated Date - 2022-06-01T08:14:41+05:30 IST