7 రోజుల్లో 6222 మంది భారతీయులను వెనక్కి తెచ్చాం: సింధియా

ABN , First Publish Date - 2022-03-05T23:09:52+05:30 IST

ఉక్రెయిన్ సంక్షోభంల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన..

7 రోజుల్లో 6222 మంది భారతీయులను వెనక్కి తెచ్చాం: సింధియా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభంల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ గంగ' చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగా గత 7 రోజుల్లో ఒక్క రొమేనియా నుంచే 29 విమానాలను నడిపామని, 6222 మంది విద్యార్థులను భారత్‌కు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో 1050 మంది విద్యార్థులను భారత్‌కు తరలించనున్నట్టు చెప్పారు.


కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి శరణార్ధులుగా దేశం విడిచిపెట్టి వెళ్తున్న వారి సంఖ్య 10 లక్షల 45 వేలకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి మెగ్రోషన్ ఏజెన్సీ తెలిపింది. ఉక్రెయిన్ విడిచిపెట్టి సరిహద్దు దేశాల్లోకి వెళ్లిన వారిలో 138 దేశాలకు చెందిన వారు ఉన్నట్టు తెలిపింది.

Updated Date - 2022-03-05T23:09:52+05:30 IST