Chief Justice of India:సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్...కేంద్రానికి జస్టిస్ యూయూ లలిత్ సిఫారసు లేఖ

ABN , First Publish Date - 2022-10-11T16:24:51+05:30 IST

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డివై చంద్రచూడ్(Justice DY Chandrachud) పేరును సిఫారసు(recommend) చేస్తూ ప్రస్థుత సీజేఐ యూయూ లలిత్(CJI UU Lalit) కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ...

Chief Justice of India:సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్...కేంద్రానికి జస్టిస్ యూయూ లలిత్ సిఫారసు లేఖ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా డివై చంద్రచూడ్(Justice DY Chandrachud) పేరును సిఫారసు(recommend) చేస్తూ ప్రస్థుత సీజేఐ యూయూ లలిత్(CJI UU Lalit) కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు.( letter to Centre) భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును యూయూ లలిత్ ప్రతిపాదిస్తూ లేఖను కేంద్రానికి పంపించారు. జస్టిస్ యూయూ లలిత్ తన వారసుడిగా చంద్రచూడ్ పేరిట సిఫార్సు లేఖను అందజేయడానికి సీజేఐ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సిఫారసు లేఖను కేంద్ర న్యాయశాఖ మంత్రికి పంపించారు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారిగా వేడుక ఫోటోగ్రాఫ్‌లను ప్రజలకు విడుదల చేశారు. సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సిఫారసు లేఖ అందజేయడాన్ని కూడా సుప్రీం బహిరంగపర్చింది.

Updated Date - 2022-10-11T16:24:51+05:30 IST