ఇమ్రాన్‌ఖాన్ అంతర్జాతీయ బిచ్చగాడు: జమాతే ఇస్లామీ చీఫ్

ABN , First Publish Date - 2022-01-17T22:08:22+05:30 IST

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జామాత్-ఇ-ఇస్లామీ (జేఐ) చీఫ్ సిరాజుల్-హక్ తీవ్ర

ఇమ్రాన్‌ఖాన్ అంతర్జాతీయ బిచ్చగాడు: జమాతే ఇస్లామీ చీఫ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై జమాతే ఇస్లామీ (జేఐ) చీఫ్ సిరాజుల్-హక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను ‘అంతర్జాతీయ బిచ్చగాడు’ అని అభివర్ణించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంతోపాటు అన్ని సమస్యలకు ఆయనే కారణమని ఆరోపించారు. ఆయనను సాగనంపితే తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లాహోర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పెట్రో ధరలను దారుణంగా పెంచేసిందని మండిపడ్డారు. ఇమ్రాన్, పాకిస్థాన్ రెండూ కలిసి పనిచేయడం సాధ్యం కాదన్నారు. 


దేశ రాజకీయాల్లో కూడికలు, తీసివేతలకు చోటు లేదని, ఇమ్రాన్‌ నిష్కృమణ ఒక్కటే అన్ని సమస్యలకు చక్కని పరిష్కారమని అన్నారు. రుణాల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చుట్టూ పాకిస్థాన్ చక్కర్లు కొడుతుండడంపై సిరాజుల్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఓ అంతర్జాతీయ బిచ్చగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీటీఐ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం ఇక దేశాన్ని పాలించలేదంటూ నిప్పులు చెరిగారు.

Updated Date - 2022-01-17T22:08:22+05:30 IST