సొంత కంపెనీ పెడతానంటే ఏడాది సెలవులిస్తాం, జీతమిస్తాం

ABN , First Publish Date - 2022-12-31T04:48:49+05:30 IST

సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని యూఏఈ ప్రకటించింది.

సొంత కంపెనీ పెడతానంటే ఏడాది సెలవులిస్తాం, జీతమిస్తాం

ప్రభుత్వ ఉద్యోగులకు యూఏఈ ఆఫర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 30: సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని యూఏఈ ప్రకటించింది. యువతను వ్యాపార రంగం వైపు మళ్లించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌ చెప్పారు. బిజినెస్‌ ప్రారంభించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా వారి అసలు వేతనంలో సగం మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఇది జనవరి 2 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కంపెనీల్లో, వ్యాపారాల్లో స్థానికులకు లబ్ధి జరిగేలా కూడా యూఏఈ చర్యలు ప్రారంభించింది. ప్రైవేటు సంస్థలు తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం 10ు మంది స్థానికులను నియమించుకోవాలని, 2026 కల్లా ఈ లక్ష్యాన్ని అందుకోవాలని యూఈఏ ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. నెలరోజుల్లోపు కనీసం 2ు మంది స్థానికులు పనిచేసేలా కంపెనీలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించింది.

Updated Date - 2022-12-31T04:48:50+05:30 IST