అక్రమ ఆయుధాల బేహారులను.. ఉగ్రవాదులుగా గుర్తించండి: కేంద్రం

ABN , First Publish Date - 2022-08-04T11:00:24+05:30 IST

విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్‌ తెప్పించి.. దేశంలో సరఫరా చేస్తున్న గ్యాంగ్‌స్టర్లను ఉగ్రవాదులుగానే పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది.

అక్రమ ఆయుధాల బేహారులను.. ఉగ్రవాదులుగా గుర్తించండి: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 3: విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్‌ తెప్పించి.. దేశంలో సరఫరా చేస్తున్న గ్యాంగ్‌స్టర్లను ఉగ్రవాదులుగానే పరిగణించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఐఏకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా గ్యాంగ్‌స్టర్లను పట్టుకునేందుకు అవసరమైతే ఎల్లలుదాటి.. అంతర్జాతీయ దర్యాప్తు చేపట్టాలని సూచించింది. అందుకు అవసరమైన అనుమతులు ఇస్తామని పేర్కొంది.  ఈ విషయంలో అవసరమైతే ఢిల్లీ పోలీసులతో సమన్వయంగా పనిచేయాలని, నిఘావర్గాల సమాచారంఆధారంగా సంయుక్త ఆపరేషన్లు నిర్వహించాలని సూచించింది.

Updated Date - 2022-08-04T11:00:24+05:30 IST