ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై ఒక్క రోజులో 6 వేల సార్లు హ్యాకర్ల పంజా
ABN , First Publish Date - 2022-12-07T04:26:07+05:30 IST
దేశ పౌరుల వైద్య డేటా మొదలు.. మన శాస్త్రవేత్తలు బయోమెడిసిన్‌పై చేసే ప్రయోగాల ఫలితాలు.. వ్యాక్సిన్ల ట్రయల్స్, దేశం వైద్యపరంగా ఎదుర్కొంటున్న
హాంకాంగ్ హ్యాకర్ల విశ్వప్రయత్నం
శక్తిమంతమైన ఫైర్‌వాల్ వల్ల విఫలం
న్యూఢిల్లీ, డిసెంబరు 6: దేశ పౌరుల వైద్య డేటా మొదలు.. మన శాస్త్రవేత్తలు బయోమెడిసిన్‌పై చేసే ప్రయోగాల ఫలితాలు.. వ్యాక్సిన్ల ట్రయల్స్, దేశం వైద్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు.. కొవిడ్ డేటా.. టెస్టింగ్ కేంద్రాల వివరాలు.. ఇలా అత్యంత కీలకమైన డేటా ఉండే భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెబ్‌సైట్‌పై సైబర్ క్రిమినల్స్ కన్నేశారు. ఒక్క రోజులో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 వేల సార్లు హ్యాకింగ్ ప్రయత్నాలు చేశారు. అయితే.. అత్యంత శక్తిమంతమైన ఫైర్‌వాల్‌ను వినియోగించడం వల్ల వారి కుట్రలు పారలేదని అధికారులు వివరించారు. వారం క్రితం(గత నెల 30న) హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. హ్యాకర్ల ఐపీల్లో ఒకటి హాంకాంగ్‌కు చెందినదని గుర్తించినట్లు వివరించారు.