IAS topper టీనా దాబీకి జైసల్మేర్ కలెక్టరుగా పోస్టింగ్

ABN , First Publish Date - 2022-07-05T15:14:51+05:30 IST

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీని నియమిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది....

IAS topper టీనా దాబీకి జైసల్మేర్ కలెక్టరుగా పోస్టింగ్

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైసల్మేర్‌ జిల్లా కలెక్టరుగా ఐఏఎస్ టాపర్ టీనా దాబీని నియమిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.ఐఏఎస్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన తొలి ఎస్సీ మహిళ అయిన టీనా దాబీకి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి కీలకమైన జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్‌ రాష్ట్రంలో ఏడుగురు జిల్లాల కలెక్టర్లతో సహా 33 మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జిల్లా ఎస్పీలతో కూడిన 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కశ్మీర్‌లో ఉన్న ఐఎఎస్ అధికారి అథర్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత టీనా దాబీ జైపూర్‌లో మరో ఐఎఎస్ అధికారి డాక్టర్ ప్రదీప్ గవాండేని వివాహం చేసుకున్నారు. టీనా దాబీ రాజస్థాన్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ జైసల్మేర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనున్నారు. గవాండే జైపూర్‌లో ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Read more