congress workerను కలిసిన అనంతరం BJP అధినేత Nadda స్పందన ఏంటంటే?
ABN , First Publish Date - 2022-06-01T18:38:04+05:30 IST
భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా(BJP President JP Nadda) తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశారట. అయితే ఆ కార్యకర్త తనతో చెప్పిన విషయాలను బుధవారం ఆయన మీడియాతో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లే ఉంటారని, క్యాడర్ ఏమాత్రం ఉండదని ఆ కార్యకర్త తనతో చెప్పినట్లు నడ్డా చెప్పుకొచ్చారు..

భోపాల్: భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా(BJP President JP Nadda) తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశారట. అయితే ఆ కార్యకర్త తనతో చెప్పిన విషయాలను బుధవారం ఆయన మీడియాతో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ లీడర్లే ఉంటారని, క్యాడర్ ఏమాత్రం ఉండదని ఆ కార్యకర్త తనతో చెప్పినట్లు నడ్డా చెప్పుకొచ్చారు. తాజాగా మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయన భోపాల్‌లోని రాజభోజ్ ఎయిర్‌పోర్ట్‌లోనే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నిన్ననే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక కార్యకర్తను కలిశాను. పార్టీకి 40 మంది మహామంత్రులు, 156 మంది మంత్రులు ఉన్నారు కానీ ఒక్క కార్యకర్త లేడని నాతో చెప్పాడు. కానీ బీజేపీ పాలసీ దేశమే ముందు. దేశం కోసం మాత్రమే మేము పనిచేస్తాం. మా కార్యకర్తలే బీజేపీని ఉన్నత స్థానంలో నిలబెట్టారు’’ అని నడ్డా అన్నారు.