అఫ్ఘాన్‌లో భారీ పేలుడు, 20మంది మృతి
ABN , First Publish Date - 2022-08-18T11:34:45+05:30 IST
అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ఓ మదర్సాలో బుధవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21మంది మృతిచెందగా..

40మందికి తీవ్ర గాయాలు
కాబూల్, ఆగస్టు 17: అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ఓ మదర్సాలో బుధవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21మంది మృతిచెందగా.. కనీసం 40మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. నగరంలోని కొతల్-ఈ-ఖాయిర్ ఖానా వద్ద సాయంత్రం ప్రార్థన సమయంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్ సెక్యూరిటీ కమాండ్ అధికార ప్రతినిధి ఖాలిద్ జడ్రాన్ వెల్లడించారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల అద్దాల పగిలిపోవడం గమనార్హం.