లోన్ చెల్లించలేకపోయిన మహిళ.. కాంటాక్టులకు మార్ఫ్‌డు ఫొటోలు

ABN , First Publish Date - 2022-06-07T18:27:27+05:30 IST

నేను గృహిణిని. నా భర్త క్యాబ్ నడుపుతుంటాడు. మే 25న యూట్యూబ్‌లో ‘క్రెడిట్ లోన్’ అనే ప్రకటన చూసి నా ఈమెయిల్‌తో సైన్ ఇన్ చేశాను. అనంతరం నా సెల్ఫీ ఫొటో, ఆధార్, పాన్ వివరాలను ఇచ్చాను. ఆ వెంటనే నా కాంటాక్ట్ పర్మిషన్ తీసుకున్నారు. నేను 5,000 రూపాయల కోసం రెక్వెస్ట్ పెడితే జూన్ 2న 3,000 రూపాయలు వచ్చాయి..

లోన్ చెల్లించలేకపోయిన మహిళ.. కాంటాక్టులకు మార్ఫ్‌డు ఫొటోలు

ముంబై: లోన్ యాప్‌లు చేసే దోపిడీ, వారు చేసే వేధింపుల గురించి తరుచూ వింటూనే ఉంటాం. తాజాగా ముంబైకి చెందిన ఒక మహిళ(22) ఏకంగా లైంగిక వేధింపుల్నే ఎదుర్కొంది. 3,000 రూపాయలు తిరిగి చెల్లించలేదని ఆన్‌లైన్ యాప్ ఒకటి మార్ఫ్‌డ్ చేసిన ఆమె నగ్న చిత్రాల్ని ఆమె కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న వారికి పంపించింది. మొత్తంగా 14 వేరు వేరు వ్యక్తులకు ఈ ఫొటోలు వెళ్లాయట. దీంతో సదరు యాప్‌పై బాధితురాలు శివాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాప్ యాజమాన్యంపై ఐటీ చట్టంలోని సెక్షన్ 504, సెక్షన్ 507, సెక్షన్ 67ఏల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


‘‘నేను గృహిణిని. నా భర్త క్యాబ్ నడుపుతుంటాడు. మే 25న యూట్యూబ్‌లో ‘క్రెడిట్ లోన్’ అనే ప్రకటన చూసి నా ఈమెయిల్‌తో సైన్ ఇన్ చేశాను. అనంతరం నా సెల్ఫీ ఫొటో, ఆధార్, పాన్ వివరాలను ఇచ్చాను. ఆ వెంటనే నా కాంటాక్ట్ పర్మిషన్ తీసుకున్నారు. నేను 5,000 రూపాయల కోసం రెక్వెస్ట్ పెడితే జూన్ 2న 3,000 రూపాయలు వచ్చాయి. ఆ వెంటనే లోన్ తిరిగి చెల్లించాని మెసేజ్లు రావడం ప్రారంభమైంది. ఇంతలోనే నాకు ఒక వీడియో వచ్చింది. నగ్నంగా ఉన్న ఆ వీడియోలో నా ఫొటో ఎడిట్ చేశారు. ఇదే వీడియోను నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి పంపారు. నాకు 14 మంది కాల్ చేసి ఇదేంటని అడిగారు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

Updated Date - 2022-06-07T18:27:27+05:30 IST