హోంమంత్రి రాజీనామా చేయాల్సిందే...
ABN , First Publish Date - 2022-04-30T17:54:49+05:30 IST
సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అక్రమాలపై కాంగ్రెస్ భగ్గుమంది. అక్రమాలకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న బీజేపీ నాయకురాలు దివ్యాహాగరగి అరెస్టు నేపథ్యంలో

- కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
బెంగళూరు: సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అక్రమాలపై కాంగ్రెస్ భగ్గుమంది. అక్రమాలకు సంబంధించి ప్రధాన సూత్రధారిగా ఉన్న బీజేపీ నాయకురాలు దివ్యాహాగరగి అరెస్టు నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తక్షణం రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు నగరంలోని ఆనందరావు సర్కిల్వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కేసును నీరుకార్చేందుకు నిందితులను కాపాడేందుకు అధికార బీజేపీలో కొందరు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత మనోహర్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడడం నేరమని, హోంమంత్రి రాజీనామాతోనే నిజాలు బయట పడతాయని అన్నారు. కష్టపడి చదివిన అభ్యర్థులు పరీక్ష రద్దుతో నిరాశకు గురయ్యారని, పకడ్బంధీగా పరక్షలు నిర్వహిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. బెంగళూరు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరశన ప్రదర్శనలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమార్కులకు శిక్ష పడకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.