ఇరాన్‌లో కదం తొక్కిన హిజాబ్‌ నిరసనకారులు

ABN , First Publish Date - 2022-10-17T08:50:45+05:30 IST

ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసినప్పటికీ శనివారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు.

ఇరాన్‌లో కదం తొక్కిన హిజాబ్‌ నిరసనకారులు

జైల్లో మంటలు.. నలుగురు మృతి.. 61 మందికి గాయాలు

టెహ్రాన్‌, అక్టోబరు 16: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేసినప్పటికీ శనివారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ‘తుపాకులు, యుద్ధ ట్యాంకులు, పేలుడు పదార్థాలు, ముల్లాలు పోవాల్సిందే’ అంటూ టెహ్రాన్‌లోని షరియతీ టెక్నికల్‌ అండ్‌ వొకేషనల్‌ కాలేజీ ఎదుట ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు రాజధాని టెహ్రాన్‌లోని ఎవిన్‌ జైలులో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరి అందక నలుగురు ఖైదీలు మరణించారు. మరో 61 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  

Updated Date - 2022-10-17T08:50:45+05:30 IST