రగిలిన హిజాబ్‌

ABN , First Publish Date - 2022-02-18T17:45:34+05:30 IST

ఉడుపిలో తలెత్తిన హిజాబ్‌ వివాదం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రబలింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హిజాబ్‌ లేకుంటే తరగతులకు వచ్చేది లేదని ఆందోళన చేశారు.

రగిలిన హిజాబ్‌

- రాష్ట్రమంతటా విద్యార్థుల ఆందోళనలు 

- బెళగావిలో ఆరుగురి అరెస్టు 

- బళ్లారిలో రహదారుల దిగ్బంధం


బెంగళూరు: ఉడుపిలో తలెత్తిన హిజాబ్‌ వివాదం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రబలింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు హిజాబ్‌ లేకుంటే తరగతులకు వచ్చేది లేదని ఆందోళన చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలోనూ నిరసనలు కొనసాగాయి. హిజాబ్‌ వివాదం హైకోర్టులో విచారణ సాగుతున్నందున మధ్యంతర ఆ దేశాలకు అనుగుణంగా విద్యాసంస్థలలోకి హిజాబ్‌, కాషాయ శాలువాలతో ప్రవేశాన్ని నిషేధించారు. అయితే ప్రతిచోటా హిజాబ్‌ లేకుండా తరగతులకు వచ్చేది లేదని విద్యార్థినులు నిరసన కొనసాగించారు. బళ్ళారిలో వేలాదిమంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. బెళగావిలోని విజయ పారామెడికల్‌ కళాశాలకు చెందిన 20మంది విద్యార్థులకు రెండుగంటలపాటు అధ్యాపకులు హైకోర్టు ఉత్తర్వులను వివరించారు. ఇదే సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కుటుంబీకులు హిజాబ్‌ వేసుకోవాలంటారు. కానీ కళాశాలలో అధ్యాపకులు నిరాకరిస్తారు. మేమేం చేయాలంటూ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సి ఉందని ప్రిన్సిపాల్‌ సూ చించారు. విద్యార్థిని సుజన్‌ మాట్లాడుతూ ఈనెల 26న పరీక్షలు ఉన్నాయని తరగతులకు దూరం చేయరాదన్నారు. మరికొన్ని రోజుల్లో రంజాన్‌ వస్తోందని ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉందో అంటూ కంటతడిపెట్టారు. 70శాతం మంది ముస్లిం విద్యార్థులు ఉన్నామని ప్రత్యేక గదిని కేటాయించాలని సూచించారు. ఇలా సాగుతుండగానే ఓ మతానికి సంబంధించి ఆరుగురు యువకులు నినాదాలు చేసిన మేరకు వారిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల ఆందోళనకు అభ్యంతరం తెలపలేదని, కానీ యువకులు నినాదాలు చేయడం సమంజసం కాదని డీసీపీ బోరలింగయ్య తెలిపారు. దక్షిణకన్నడ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. అయితే పలువురు అధ్యాపకులు హిజాబ్‌తోనే బోధనలు కొనసాగించడంపై కొత్త వివాదం తలెత్తింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లో 5,300 పీయూ కళాశాలలు ఉన్నాయని వాటిలో నాలుగుచోట్ల మాత్రమే హిజాబ్‌లతో వచ్చేందుకు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. 1.20కోట్లమంది విద్యార్థులకుగాను ఐదారువందలమంది పట్టుబడుతున్నారన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హైకోర్టు ఆదేశాలను పాటించడం అభినందనీయమన్నారు. కాగా విజయపుర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. కాగా హిజాబ్‌కు మద్దతుగా ఆందోళన చేస్తున్నవారికి బెదిరింపులు వచ్చిన మేరకు పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శివమొగ్గలో గతవారం గొడవలు చోటు చేసుకున్న కళాశాలలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. బాపూజీనగర్‌ కళాశాల, సాగర్‌ పీయూ కాలేజ్‌, మీనాక్షి భవన్‌ వద్ద ఉండే పీయూ కళాశాలలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. హుబ్బళ్ళిలో విద్యార్థులు ‘ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అంటూ నిరసన కొనసాగించారు. ఉత్తరకన్నడ, మైసూరు, కొప్పళ ప్రాంతాలలో కళాశాలలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. 

Updated Date - 2022-02-18T17:45:34+05:30 IST