ఆప్షన్‌ పెట్టుకున్నవారికే అధిక పింఛను

ABN , First Publish Date - 2022-12-31T05:04:18+05:30 IST

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈపీఎఫ్‌ పథకం కింద అఽధిక పింఛను పొందడంపై ఈపీఎ్‌ఫఓ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆప్షన్‌ పెట్టుకున్నవారికే అధిక పింఛను

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈపీఎఫ్‌ పథకం కింద అఽధిక పింఛను పొందడంపై ఈపీఎ్‌ఫఓ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తీర్పును ఎనిమిది వారాల్లో అమలు చేస్తామని పేర్కొంది. అదనపు పించనుకు ఎవరెవరు అర్హులన్నదానిపై స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబర్‌ 1కి ముందు పదవీ విరమణ చేసినవారు జీతంలో ఎక్కువ మొత్తాన్ని పెన్షన్‌ నిధికి జమ చేసి, అధిక పెన్షన్‌ కోసం ఆప్షన్‌ను పెట్టుకున్న వారికే ఇది వర్తిస్తుంది. రూ. 5వేల నుంచి రూ, 6,500 వేతన పరిమితిని మించి జీతంలో ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్‌ నిధికి జమ చేసిన వారు ఇందుకు అర్హులు. ఈపీఎఫ్‌ పింఛను పథకాన్ని సవరించకముందు జాయింట్‌ ఆప్షన్‌ను కోరుకున్న వారు, అలా ఆప్షన్‌ పెట్టుకున్నా ఈపీఎఫ్‌ సంస్థ తిరస్కరణ పొందిన వారు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే సవరించని ఈపీఎఫ్‌ పథకంలోని పేరా 11(3) కింద ఎలాంటి ఆప్షన్‌ను కోరకుండా 2014 సెప్టెంబర్‌ 1కి ముందు రిటైరైన ఉద్యోగులకు, ఈపీఎఫ్‌ సభ్యత్వం నుంచి తప్పుకొన్న వారికీ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎలాంటి ప్రయోజన లభించదని తెలిపింది.

Updated Date - 2022-12-31T05:04:19+05:30 IST