High Court: టీచర్‌ పోస్టులకు వారిని ‘దూరం’ పెట్టండి

ABN , First Publish Date - 2022-12-07T07:40:48+05:30 IST

దూరవిద్య ద్వారా చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దన్న మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) ఆ పోస్టులకు

High Court: టీచర్‌ పోస్టులకు వారిని ‘దూరం’ పెట్టండి

- దూరవిద్యలో చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దు

- మద్రాసు హైకోర్టు

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 6: దూరవిద్య ద్వారా చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దన్న మద్రాస్‌ హైకోర్టు(Madras High Court) ఆ పోస్టులకు వారు అనర్హులని తేల్చిచెప్పింది. దూరవిద్యలో అభ్యసించిన వారి ఉపాధ్యాయ నియామకాల నిబంధనలను రాష్ట్రప్రభుత్వం మూడు నెలల్లో పునఃపరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల్లో తనకు అన్యాయం జరిగిందంటూ తిరువారూర్‌(Tiruvarur) జిల్లా నన్నిలం ప్రభుత్వ పాఠశాల యూజీ ఉపాధ్యాయురాలు నిత్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ మేరకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా నిత్య, బీఎడ్‌ తమిళ మీడియంలో చదివిన తర్వాత, బీఏ ఆంగ్ల మీడియంలో చదివివారని,అది కూడా దూరవిద్య ద్వారా అభ్యసించడం వల్ల ఆమెకు ఆంగ్ల ఉపాధ్యాయుల విభాగంలో పదోన్నతి కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. దానిపై న్యాయమూర్తి స్పందిస్తూ. నిత్య తమిళ ఉపాధ్యాయుల విభాగంలో పదోన్నతికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థలకు వెళ్లి చదువుకున్న వారినే ఉపాధ్యాయులుగా నియమించాలని పలుమార్లు న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. దూరవిద్య ద్వారా డిగ్రీలు పొందిన వారు ఉపాధ్యాయ నియామకాలకుఅర్హులు కాదని పేర్కొన్నారు. రిజర్వేషన్‌ అమలులో కూడా అర్హులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలన్నారు.

Updated Date - 2022-12-07T07:40:50+05:30 IST