Padayatra: రాహుల్‌ కోసం సిద్ధమవుతున్న హెలిప్యాడ్‌

ABN , First Publish Date - 2022-09-02T14:33:24+05:30 IST

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పర్యటన కోసం కన్నియాకుమారి ప్రభుత్వ అతిథిగృహం సమీపంలోని హెలిప్యాడ్‌

Padayatra: రాహుల్‌ కోసం సిద్ధమవుతున్న హెలిప్యాడ్‌

చెన్నై, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పర్యటన కోసం కన్నియాకుమారి ప్రభుత్వ అతిథిగృహం సమీపంలోని హెలిప్యాడ్‌ మరమ్మతులు చురుకుగా సాగుతున్నాయి. కన్నియా కుమరిలో ఈ నెల 7 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ పాదయాత్రకోసం కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కన్నియాకుమారి(Kanniyakumari)కి రాహుల్‌ హెలికాప్టర్‌లో రానున్నారు. హెలిపాడ్‌ సమీపంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఏడో తేదీ సాయంత్రం పాదయాత్రను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హెలిప్యాడ్‌ పరిసరాలను ఎక్సకవేటర్‌తో శుభ్రం చేయిస్తున్నారు. ఇక పాదయాత్ర సందర్భంగా జరిగే బహిరంగ సభలో డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, డీఎంకే మిత్రపక్షాల నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Read more