శబరిమలకు హెలికాప్టర్‌ సేవలు వద్దు

ABN , First Publish Date - 2022-12-07T04:16:51+05:30 IST

శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులకు హెలికాప్టర్లలో తీసుకురావద్దంటూ విమానయాన(ఏవియేషన్‌) సంస్థలకు కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

శబరిమలకు హెలికాప్టర్‌ సేవలు వద్దు

కొచి, డిసెంబరు 6: శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులకు హెలికాప్టర్లలో తీసుకురావద్దంటూ విమానయాన(ఏవియేషన్‌) సంస్థలకు కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భక్తులకు హెలికాప్టర్‌ సేవలను అందిస్తున్నామంటూ ఒక ప్రైవేటు ఏవియేషన్‌ సంస్థ ఇటీవల చేసిన ప్రకటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తగిన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రావెన్‌కోర్‌ దేవస్వాం బోర్డుకు సూచనలు జారీచేసింది. ప్రముఖుల కోసం ఈ తరహా ఏర్పాట్లు చేయడం మానుకోవాలని బోర్డుకు కోర్టు హితవు చెప్పింది.

Updated Date - 2022-12-07T04:17:07+05:30 IST