Heavy rains: చెన్నైని ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-10-07T13:05:32+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు చెన్నై(Chennai) సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం

Heavy rains: చెన్నైని ముంచెత్తిన వాన

                                 - రెండు రోజులు భారీ వర్ష సూచన


అడయార్‌(చెన్నై), అక్టోబరు 6: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో  రెండు రోజులపాటు చెన్నై(Chennai) సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో బాహ్య మండలంపై వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా నగరంలో గురువారం వేకువజాము మూడు గంటల నుంచి చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు(Kanchipuram, Thiruvallur, Chengalpattu) జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుండే చల్లగాలులు వీస్తూ వర్షం ప్రారంభమైంది., ఆ తర్వాత ఉదయం ఏడు గంటల వరకు నగరంలో రాయపేట, రాయపురం, మైలాపూరు, మధురవాయల్‌, అన్నానగర్‌, ట్రిప్లికేన్‌, అడయార్‌ తదితర ప్రాంతాల్లో ఓ మోస్గరు వర్షం కురిసింది. ఇక మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది తమిళనాడు, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాలపై ప్రభావం చూపించనుంది. ఈ కారణంగా బుధవారం ఈ రెండు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడనం మరింతగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా సేలం, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, విల్లుపురం, కడలూరు, కళ్ళకుర్చి, తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, పుదుక్కోట, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Updated Date - 2022-10-07T13:05:32+05:30 IST