Heavy rain: నేడు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2022-11-15T08:10:42+05:30 IST

రాష్ట్రంలో ఈశాన్యరుతుపవనాల తీవ్రత, వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తొమ్మిది జిల్లాల్లో(In nine districts) భారీగా వర్షాలు కురుస్తాయని వాతావర

Heavy rain: నేడు భారీ వర్ష సూచన

చెన్నై: రాష్ట్రంలో ఈశాన్యరుతుపవనాల తీవ్రత, వాతావరణంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తొమ్మిది జిల్లాల్లో(In nine districts) భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకులు సెంథామరై కన్నన్‌ ప్రకటించారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తేని, దిండుగల్‌, మదురై, విరుదునగర్‌, రామనాధపురం, తెన్‌కావి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

చెన్నైలో మళ్లీ వర్షం...

నగరానికి సంబంధించినంత వరకూ ఆకాశం మేఘావృతమై ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఆయన తెలిపారు. రానున్న 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. రెండు రోజులపాటు కారుమబ్బులతో వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ విరామం తీసుకున్న వర్షం సాయంత్రానికి చిరుజల్లులతో ప్రారంభమైంది. రాయపురం, అడయారు, మధురవాయల్‌ తదితర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Updated Date - 2022-11-15T08:10:45+05:30 IST