Condom Pack: షాకింగ్!.. తలగాయానికి కండోమ్ ప్యాక్‌తో డ్రెసింగ్!

ABN , First Publish Date - 2022-08-21T00:53:51+05:30 IST

గాయమై తల నుంచి రక్తం కారుతున్న మహిళకు ఓ వైద్యుడు కండోమ్ రేపర్‌తో బ్యాండేజ్ వేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌

Condom Pack: షాకింగ్!.. తలగాయానికి కండోమ్ ప్యాక్‌తో డ్రెసింగ్!

మొరేనా: గాయమై తల నుంచి రక్తం కారుతున్న మహిళకు ఓ వైద్యుడు కండోమ్ రేపర్‌తో బ్యాండేజ్ వేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మొరేనా(Morena) జిల్లాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. రక్తమోడుతున్న మహిళ తలపై కొద్దిపాటి దూది ఉంచి దానిపై కండోమ్ రేపర్‌ (condom wrapper)ను వేసి తాత్కాలిక బ్యాండేజ్ వేశాడు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో విషయం వెలుగు చూసింది. అక్కడ గాయానికి చికిత్స చేసేందుకు బ్యాండేజ్ విప్పిన వైద్యులు కండోమ్ రేపర్ చూసి షాకయ్యారు. 


ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. బాధిత మహిళ రేష్మాబాయ్ ధర్మాగఢ్ నుంచి ఆసుపత్రికి వచ్చినట్టు చెప్పారు. ఆ సమయంలో డాక్టర్ ధర్మేంద్ర రాజ్‌పుత్, వార్డ్‌బాయ్ ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నారని చెప్పారు. కాటన్ ప్యాడ్ మీద ఏదైనా మెటీరియల్ లాంటి కార్డ్‌బోర్డ్ పెట్టమని వార్డుబాయ్‌కి డాక్టర్ ధర్మేంద్ర సూచించారని, కానీ అతడు కండోమ్ ప్యాకెట్(Condom Pack) పెట్టాడని వివరించారు. పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రెస్సర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-21T00:53:51+05:30 IST