భార్యను చంపేసి.. 400 కి.మీల దూరంలో పూడ్చేసి

ABN , First Publish Date - 2022-12-15T03:03:14+05:30 IST

భార్యను చంపి, ‘నా భార్య కనిపించట్లేదం’టూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో డాక్టర్‌. ఈ ఘటన యూపీలోని లఖింపూర్‌లో జరిగింది.

భార్యను చంపేసి.. 400 కి.మీల దూరంలో పూడ్చేసి

కనిపించట్లేదని ఫిర్యాదు.. యూపీలో ఘటన

లఖ్‌నవూ, డిసెంబరు 14: భార్యను చంపి, ‘నా భార్య కనిపించట్లేదం’టూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో డాక్టర్‌. ఈ ఘటన యూపీలోని లఖింపూర్‌లో జరిగింది. అభిషేక్‌ అవస్థి, వందనా శుక్లా ఇద్దరూ ఆయుర్వేదిక్‌ డాక్టర్లు. 2014లో పెళ్లి చేసుకున్నారు. నవంబరు 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అభిషేక్‌ తన తండ్రి గౌరీ శంకర్‌తో కలిసి వందన తలపై కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తర్వాత అభిషేక్‌ భార్య మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి, అంబులెన్స్‌లో 400 కి.మీలు తీసుకెళ్లి పాతిపెట్టాడు. మరుసటి రోజు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ‘‘నా భార్య కనిపించడం లేదు. విలువైన వస్తువులను తీసుకుని వెళ్లిపోయింది’’ అని ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మధ్య గొడవల విషయం తెలిసిన పోలీసులు అభిషేక్‌ను ప్రశ్నించగా నిజం తెలిసింది.

Updated Date - 2022-12-15T03:03:15+05:30 IST