బాలిక గ్యాంగ్‌రేప్.. బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు

ABN , First Publish Date - 2022-04-11T21:45:22+05:30 IST

బాలికపై టీఎమ్‌సీ (తృణమూల్ కాంగ్రెస్) నేత కొడుకు హత్యాచారానికి పాల్పడ్డ ఘటనకు నిరసనగా మంగళవారం పశ్చిమ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర బీజేపీ. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించింది.

బాలిక గ్యాంగ్‌రేప్.. బెంగాల్ బంద్‌కు బీజేపీ పిలుపు

బాలికపై టీఎమ్‌సీ (తృణమూల్ కాంగ్రెస్) నేత కొడుకు హత్యాచారానికి పాల్పడ్డ ఘటనకు నిరసనగా మంగళవారం పశ్చిమ బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర బీజేపీ. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించింది. హత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా హన్స్‌ఖలీకి చెందిన పద్నాలుగేళ్ల బాలిక స్థానిక పంచాయతి సభ్యుడి కొడుకు పుట్టిన రోజు వేడుకలకు హాజరైంది. మధ్యాహ్నం పార్టీకి వెళ్లిన బాలిక సాయంత్రం తీవ్ర అనారోగ్యకర స్థితిలో ఇంటికి తిరిగొచ్చింది. వెంటనే గుర్తించిన బాలిక తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకేళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే బాలిక మరణించింది. 


ఇంటికి తిరిగొచ్చిన బాలిక రక్తస్రావానికి గురైందని, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడిందని బాలిక తల్లి చెప్పింది. పార్టీకి హాజరైన ఇతరులు చెప్పిన వివరాల ఆధారంగా బాలికపై టీఎమ్‌సీ నేత కొడుకు, అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్టట్లు బాలిక తల్లి గుర్తించింది. మరోవైపు బాలిక మరణించగానే త్వరగా అంత్యక్రియలు చేయాలని నిందితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బెదిరించారని కూడా బాలిక తల్లి పేర్కొంది. ఘటన జరిగిన తర్వాత బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయొద్దని, బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లొద్దని నిందితుడి కుటుంబ సభ్యులు బెదిరించినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడైన టీఎమ్‌సీ నేత సమర్ గోలి, అతడి కొడుకు సోహెల్ పరారీలో ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై రేపు విచారణ జరగనుంది.

Read more