హతమారుస్తానని బెదిరించారు..: హరిప్రసాద్‌

ABN , First Publish Date - 2022-02-19T18:12:57+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ బెదిరించారని విధానపరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. నళిన్‌కుమార్‌ కటీల్‌

హతమారుస్తానని బెదిరించారు..: హరిప్రసాద్‌

బెంగళూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ బెదిరించారని విధానపరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ.. నళిన్‌కుమార్‌ కటీల్‌ నేరుగా తనను హతమారుస్తానని బెదిరించారన్నారు. ఇటువంటి హెచ్చరికలకు భయపడేది లేదన్నారు. తమ పూర్వీకులు బ్రిటిష్‌ సైనికుల తుపాకులకే భయపడలేదని, బీజేపీ నాయకుల బెదిరింపులకు భయపడతామా..? అన్నారు. బీజేపీ నాయకులు నకిలీ దేశభక్తులని, వారికి భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ అంశంపై పోరాటం చేస్తానన్నారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గూండాలాగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు. కార్యకర్తలకు ఫోన్‌ చేసి తనకు ప్రాణహాని కలిగేలా బెదిరించారని బీకే హరిప్రసాద్‌ ఆరోపించారు. 

Read more