Gukta Scam: ఇద్దరు మాజీ మంత్రులతో సహా 10 మంది ప్రాసిక్యూషన్‌కు తమిళనాడు అనుమతి

ABN , First Publish Date - 2022-07-23T21:51:54+05:30 IST

గుట్కా స్కామ్ కేసులో సీబీఐ చేసిన విజ్ఞప్తి మేరకు 10 మందిని ప్రాసిక్యూషన్.. చేసేందుకు తమిళనాడు

Gukta Scam: ఇద్దరు మాజీ మంత్రులతో సహా 10 మంది ప్రాసిక్యూషన్‌కు తమిళనాడు అనుమతి

చెన్నై: గుట్కా స్కామ్ (Gutka Scam) కేసులో సీబీఐ (CBI) చేసిన విజ్ఞప్తి మేరకు 10 మందిని ప్రాసిక్యూషన్ చేసేందుకు తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వం అనుతించింది. ఈ పది మందిలో ఇద్దరు అన్నాడీఎంకే మాజీ మంత్రులు - బీవీ రమణ, సి.విజయభాస్కర్ ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద రిటైర్డ్ డీజీపీలు ఎస్.జార్జి, టీకే రాజేంద్రన్‌ల ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని కూడా కేంద్రాన్ని తమిళనాడు సర్కార్ కోరింది.


కాగా, ఈ స్కామ్‌లో 10 మందిని ప్రాసిక్యూట్ చేసేందుకు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఈనెల 19న అనుమతించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇద్దరు డీజీపీలు చెన్నై సిటీ పోలీస్ మాజీ కమిషనర్లని, ఒకరు 2017, మరొకరు 2019లో పదవీ విరణణ చేశారని ఆ వర్గాలు చెప్పారు. ఈ ఇద్దరి అధికారుల ప్రాసిక్యూషన్‌కు కేంద్ర హోం శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.


ఎనిమిది మంది వీరే..

గుట్కా స్కామ్‌లో ప్రాసిక్యూషన్‌కు స్టాలిన్ సర్కార్ అనుమతి ఇచ్చిన తక్కిన ఎనిమిది మందిలో కమర్షియల్ టాక్స్ శాఖ మనలి ఎస్సెస్‌మెంట్ సర్కిల్ కమర్షియల్ టాక్స్ మాజీ అధికారి ఎస్.గణేశన్, ఆహారభద్రతా శాఖ మాజీ డిజిగ్నేటెడ్ అధికారి లక్ష్మీ నారాయణన్, తురువల్లూరు గుమ్మిడిపూండి బ్లాక్ మాజీ ఫుడ్ సేఫ్టీ అధికారి పి.మురుగున్, పుళల్ రేంజ్ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.మన్నార్ మన్నన్, రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి.సంపత్, మాజీ కౌన్సిలర్/చెన్నై కార్పొరేషన్ హెల్త్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.పళని ఉన్నారు.


గుట్కా సరఫరాదారుల నుంచి ఈ కేసులోని నిందితులు లంచాలు తీసుకున్నారని, 1998 అవినీతి నిరోధక విభాగంలోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడ్డారని సీబీఐ దర్యాప్తు నివేదక పేర్కొంటోంది. ఈ నివేదికను తమిళనాడు సర్కార్‌కు ఇటీవల సీబీఐ పంపడంతో పాటు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై మద్రాసు హైకోర్టు అభిప్రాయాన్ని (openion) రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రమణ, విజయభాస్కర్, మరో 10 మందిపై ఈకేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 14  తన ఒపీనియన్‌లో తెలియజేశారు.

Updated Date - 2022-07-23T21:51:54+05:30 IST