యాపిల్ స్టోర్‌లో దుండగుడి హల్‌చల్... నిర్బంధంలో ఉన్నవారికి విముక్తి...

ABN , First Publish Date - 2022-02-23T21:42:20+05:30 IST

సెంట్రల్ అమ్‌స్టర్‌డాంలోని యాపిల్ స్టోర్‌లో హల్‌చల్ చేసిన గన్‌మన్

యాపిల్ స్టోర్‌లో దుండగుడి హల్‌చల్... నిర్బంధంలో ఉన్నవారికి విముక్తి...

న్యూఢిల్లీ : సెంట్రల్ అమ్‌స్టర్‌డాంలోని యాపిల్ స్టోర్‌లో హల్‌చల్ చేసిన గన్‌మన్ నిర్బంధంలో ఉన్నవారికి పోలీసులు విముక్తి కల్పించారు. పోలీసులు అనేక గంటలపాటు శ్రమించిన తర్వాత ఆ దుండగుడిని అదుపులోకి తీసుకోగలిగారు. మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు దొంగతనానికి వచ్చిన ఈ గన్‌మన్ ఆ స్టోర్‌లో ఉన్నవారిని నిర్బంధించాడు. 


ఈ గన్‌మన్ వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం రోబో సహాయంతో పరీక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఈ స్టోర్‌లో నిర్బంధంలో ఉన్నవారిలో చాలా మంది చాకచక్యంగా తప్పించుకోగలిగారని తెలిపారు. చిట్టచివరి వ్యక్తికి కూడా సురక్షితంగా విముక్తి కల్పించామని చెప్పారు.  సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయని, దర్యాప్తులో వీటిని ఉపయోగించుకుంటామని చెప్పారు. 


అంతకుముందు పోలీసులు పెద్ద ఎత్తున యాపిల్ స్టోర్ వెలుపల మోహరించారు. ఈ పరిసరాల్లోని ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. 


Read more