‘గిన్నిస్‌’ శునకం మరణం

ABN , First Publish Date - 2022-10-08T09:03:50+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న శునకం పేరు టెర్రియర్‌. ప్రపంచంలోనే అత్యధిక కాలం (22 ఏళ్లు) జీవించిన శునకంగా ఇది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది.

‘గిన్నిస్‌’ శునకం మరణం

22 ఏళ్లు జీవించిన ‘టెర్రియర్‌’

చిత్రంలో కనిపిస్తున్న శునకం పేరు టెర్రియర్‌. ప్రపంచంలోనే అత్యధిక కాలం (22 ఏళ్లు) జీవించిన శునకంగా ఇది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది. 2000 మార్చి 28న జన్మించిన టెర్రియర్‌ అక్టోబరు 3న మరణించింది. దీనికన్నా ముందు టోబీకెత్‌ అనే శునకం 21 ఏళ్లు జీవించింది. అమెరికాలోని సౌత్‌ కరోలినాలో ఉంటున్న బోబి, జూలీ గ్రెగోరీ దంపతులు ‘టెర్రియర్‌’ను దత్తత తీసుకుని పెంచారు. రాఖీ అనే భాగస్వామితో కలిసి ఈ శునకం 32 పిల్లలను కన్నది.

Read more