Dibrugarh: గర్భిణి టీచర్‌పై విద్యార్థుల దాడి

ABN , First Publish Date - 2022-11-30T19:31:22+05:30 IST

డిబ్రూగఢ్ యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటన మరచిపోక ముందే మరోసారి డిబ్రూగఢ్ విద్యార్థులు ఒక గర్భిణీ టీచర్‌పై దాడికి పాల్పడిన ఘటన..

Dibrugarh: గర్భిణి టీచర్‌పై విద్యార్థుల దాడి

అసోం: డిబ్రూగఢ్ యూనివర్శిటీలో ర్యాగింగ్ ఘటన మరచిపోక ముందే మరోసారి డిబ్రూగఢ్ (Dibrugarh) విద్యార్థులు ఒక గర్భిణీ టీచర్‌పై దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో ఈనెల 27న ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల గర్బిణి అయిన హిస్టరీ టీచర్‌పై సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు దాడి చేసినట్టు డిబ్రూగఢ్ జేఎన్‌వీ ప్రిన్సిపాల్ తెలిపారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఒక విద్యార్థి సరిగా చదవడం లేదంటూ అతని తల్లిదండ్రులకు టీచర్ ఫిర్యాదు చేసిందని, దాంతో ఆమెపై కొందరు విద్యార్థులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. గాయపడిన టీచర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని హెచ్ఎం చెప్పారు. స్కూలు ఆవరణలోనే ఈ దాడి జరిగిందని, తనపై కూడా విద్యార్థులు దాడికి ప్రయత్నించారని చెప్పారు. దీంతో పోలీసులను పిలించామని, ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 22 మంది విద్యార్థులను అధికారులు సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు.

డిబ్రూగర్ విద్యార్థులు ఇటీవల నేరపూరిత చర్యలకు దిగడం ఇది రెండో సారి. ఈమధ్యనే డిబ్రూగఢ్ యూనివర్శిటీలోని పీఎన్‌జీబీ హాస్టల్‌లో ఉంటున్న ఆనంద్ శర్మ అనే విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తోటి విద్యార్థుల ర్యాగింగ్ నుంచి తప్పించుకునేందుకు అతను కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ర్యాంగింగ్ ఘటనను అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ తప్పుపట్టారు. ఇది కచ్చితంగా యూనివిర్శిటీ నిర్లక్ష్యమేనని, ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు వర్శిటీ అధికారులు ప్రయత్నిస్తున్నారా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని చెప్పారు.

Updated Date - 2022-11-30T19:31:23+05:30 IST