నిఘా నీడలో గ్రూప్‌-1 పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-05T14:21:09+05:30 IST

డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సహకారశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ తదితర 66 పోస్టులకు సంబంధించిన గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చెన్నైలో మాత్రమే నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో

నిఘా నీడలో గ్రూప్‌-1 పరీక్షలు ప్రారంభం

                     - మే లో ఫలితాలు


ప్యారీస్‌(చెన్నై): డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ, సహకారశాఖ సబ్‌ రిజిస్ట్రార్‌ తదితర 66 పోస్టులకు సంబంధించిన గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చెన్నైలో మాత్రమే నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతోపాటు కొవిడ్‌ నిబంధనల్ని అమలుపరిచారు. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎన్‌పీ ఎస్సీ) అధికారులు తనిఖీలు చేశారు. మే నెలలో ఫలితాలు వెల్లడించనున్నట్లు టీఎన్‌పీఎస్సీ ఛైర్మన్‌ బాలచంద్రన్‌ తెలిపారు. రాష్ట్రప్రభుత్వ శాఖల్లో 66 ఖాళీ పోస్టులు భర్తీకి టీఎన్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. 2020 జనవరి 20న ఈ పరీక్షలకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 3వ తేది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో 1,31,731 మంది హాజరుకాగా, వారిలో 3,800 మంది మెయిన్స్‌ అర్హత పొందారు. స్థానిక ట్రిప్లికేన్‌లోని ఎన్‌కేటీ బాలికల మహోన్నత పాఠశాల, మైలాపూర్‌ పీఎస్‌ మెట్రిక్యు లేషన్‌ పాఠశాల సహా మొత్తం 37 కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షలు పటిష్ట నిఘా మధ్య ప్రశాంతంగా జరిగాయి. టీఎన్‌పీఎస్సీ చైర్మన్‌ బాలచంద్రన్‌ పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ జరుగుతాయని, పరీక్షలు ముగిశాక జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందని, సాధ్యమైనంత వరకు మేలో ఈ పరీక్షా ఫలితాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-03-05T14:21:09+05:30 IST