మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషికి నివాళి

ABN , First Publish Date - 2022-03-16T08:08:45+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ మణిశంకర్‌ జోషి (88) తీవ్ర అనారోగ్యంతో గుజరాత్‌ ..

మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషికి నివాళి


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ మణిశంకర్‌ జోషి (88) తీవ్ర అనారోగ్యంతో గుజరాత్‌ నవ్సారీ జిల్లాలోని స్వగ్రామం ధానోరిలో సోమవారం కన్నుమూశారు. నవంబరు 26, 1985 నుంచి ఫిబ్రవరి 7, 1990 వరకు ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా సేవలందించారు. కేంద్రంలో రెండుసార్లు సహాయ మంత్రిగా పనిచేశారు. 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. గుజరాత్‌ పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత మహిళా కాంగ్రె్‌సకు అధ్యక్షురాలిగా పనిచేశారు. మరోవైపు, ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జోషికి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా సంతాపాన్ని ప్రకటించింది. గాంధీభవన్‌లో మంగళవారం ఆమె చిత్రపటానికి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌, కుమార్‌రావు, కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి నివాళి అర్పించారు. 

Read more