రక్షణశాఖ కార్యదర్శిగా గిరిధర్‌

ABN , First Publish Date - 2022-11-02T05:30:55+05:30 IST

కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులైన ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమనే మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు.

 రక్షణశాఖ కార్యదర్శిగా గిరిధర్‌

కేంద్రం, ఏపీలో వివిధ హోదాల్లో సేవలు

న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులైన ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అరమనే మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర సైనికులకు నివాళులర్పించారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను ఇటీవలే ప్రభుత్వం రక్షణశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. తన 32ఏళ్ల సర్వీసులో గిరిధర్‌ కేంద్రం, ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఏపీ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్‌ ఎండీ, ఆర్థికశాఖ కార్యదర్శిగా సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో చిత్తూరు, ఖమ్మం జిల్లాల కలెక్టర్‌గా వ్యవహరించారు. జేఎన్‌టీయూ, హైదరాబాద్‌లో బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌), ఐఐటీ మద్రాస్‌ నుంచి ఎంటెక్‌ పూర్తిచేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీలో ఎంఏ(ఎకనామిక్స్‌) అభ్యసించారు. కాగా, ఇప్పటి వరకూ రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్‌ కుమార్‌ సెప్టెంబరు 31న పదవీ విరమణ చేశా

Updated Date - 2022-11-02T05:30:56+05:30 IST