కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-08-17T06:36:27+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అధిష్ఠానానికి షాక్‌ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి..

కాంగ్రెస్‌కు గులాం నబీ ఆజాద్‌ షాక్‌

జమ్మూ కశ్మీర్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా


న్యూఢిల్లీ/జమ్మూ, ఆగస్టు 16 : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అధిష్ఠానానికి షాక్‌ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి.. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి ఒకేసారి రాజీనామా చేశారు. పార్టీ బాధ్యతలు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జమ్మూ, కశ్మీర్‌కు సంబంధించి పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు కాంగ్రెస్‌ మంగళవారం పలు కమిటీలను వేసింది. ఇందులో భాగంగా జమ్మూ, కశ్మీర్‌ చీఫ్‌ బాధ్యతలను ఆజాద్‌ సన్నిహితుడు వికార్‌ రసూల్‌ వనీకి అప్పగించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆజాద్‌ పేరును ప్రకటించింది.  

Read more