తెలంగాణ విద్యార్థుల కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు: గౌరవ్ ఉప్పల్

ABN , First Publish Date - 2022-02-25T19:38:51+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు సహాయం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

తెలంగాణ విద్యార్థుల కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు: గౌరవ్ ఉప్పల్

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులకు సహాయం కోసం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఉదయం నుంచి ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల నుంచి కాల్స్, మెయిల్స్ వస్తున్నాయన్నారు. కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ తెరుచుకున్నాక అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎయిర్ పోర్టులో లైజనింగ్ టీమ్ ఉందని,  కేంద్ర ప్రభుత్వ అడ్వాయిజరీలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలిజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి వారి పూర్తి వివరాల్ని తీసుకుంటున్నామన్నారు. ఎవరు ఆందోళన చెందవద్దని గౌరవ్ ఉప్పల్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-25T19:38:51+05:30 IST